Harish Rao : కాళేశ్వరం డిజైనింగ్ సరిగా లేదని, అందుకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి మండిపడ్డారు. నిండుకుండలా ఉన్న మల్లన్న సాగర్‌ను చూస్తుంటే తనకు కడుపు నిండిన అనుభూతి కలుగుతున్నదని ఆయన అన్నారు. మల్లన్న సాగర్ నిండుగా ఒక సముద్రంలా కనబడుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. కాళేశ్వరం కొట్టుకపోయిందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోతే మల్లన్న సాగర్‌లోకి 21 టీఎంసీల నీళ్లు ఎట్ల వచ్చినయని ఆయన ప్రశ్నించారు. కాగా మల్లన్నసాగర్ జలాశయాన్ని చూసేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీశ్‌రావును, ఇతర బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు.