హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి హరీశ్‌రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ భవన్లో ఉన్న హరీశ్‌రావు ఒక్కసారిగా నీరసించి, అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే బేగంపేటలోని సన్‌షైన్ కిమ్స్ దవాఖానకు తరలించారు.
నీరసం, జ్వరం మినహా హరీశ్‌రావు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అస్వస్థతతో దవాఖానలో చేరిన హరీశ్‌రావును మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని యథావిధిగా ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు.