పాలమూరుకు నీళ్లెందుకు ఇవ్వరు?
శ్రీశైలం నుంచి 738 కిలోమీటర్ల దూరంలో ఎకడో పెన్నా బేసిన్లో ఉన్న కుప్పం వరకు కృష్ణా జలాలు తరలిపోతుంటే పట్టించుకోని ప్రభుత్వం.. నదికి తలాపునే ఉన్న పాలమూరుకు మాత్రం ఎందుకు నీళ్లివ్వడం లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు.
- 738 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్నా బేసిన్‌లోని కుప్పం వరకు తరలిస్తుంటే పట్టదా?
- తప్పు మీరు చేస్తే, రైతులు శిక్ష అనుభవించాలా?
- బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజం
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం నుంచి 738 కిలోమీటర్ల దూరంలో ఎకడో పెన్నా బేసిన్లో ఉన్న కుప్పం వరకు కృష్ణా జలాలు తరలిపోతుంటే పట్టించుకోని ప్రభుత్వం.. నదికి తలాపునే ఉన్న పాలమూరుకు మాత్రం ఎందుకు నీళ్లివ్వడం లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు.
కృష్ణా జలాలను ఏపీకి వదిలిపెట్టి తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఎందుకు గాలికొదిలేశారు? దీనికి ముఖ్యమంత్రి గానీ, నీళ్ల మంత్రిగానీ సమాధానం చెప్తారా? అని నిలదీశారు. జూరాల ఆయకట్టు పొలాలకు సాగునీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న రైతులు, ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడాన్ని సోమవారం ఒక ప్రకటనలో ఆయన ఖండించారు.
రైతుల పక్షాన పోరాడుతున్న మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు ఇతర నాయకులను అక్రమంగా నిర్బంధించడం దుర్మార్గమని విమర్శించారు.
కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్ (8.51 టీఎంసీ), ఏదుల (6.55 టీఎంసీ), కరివెన(17.34 టీఎంసీ), వట్టెం (16.74 టీఎంసీ) మొత్తం 50 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాలను నిర్మిస్తే.. వాటిని నీళ్లతో నింపే సోయి కూడా మీకు లేదా? అని ప్రశ్నించారు. రెండున్నరేండ్లపాటు కృష్ణానదిలో పుషలంగా నీళ్లు పారినా ఎందుకు మోటర్లను నడుపలేదు? శ్రీశైలం నిండుగా ఉన్నా నీళ్లు ఎందుకు ఎత్తిపోయలేదని నిగ్గదీశారు.
రైతుల నోట్లో మట్టి కొట్టారు
పాలమూరును ప్రాజెక్టును పడావు పెట్టి, రైతుల నోట్లో మట్టి కొట్టారని హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి పాలమూరు రైతులకు చేస్తున్న నమ్మకద్రోహం ఇదని విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డి.. రైతులంటే ఎందుకంత నిర్లక్ష్యం? జూరాల ప్రాజెక్టును పోలీసులు పూర్తిగా దిగ్బంధించి, ఆనకట్ట పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు.
కనిపిస్తే అరెస్టులు చేస్తున్నారు? ఎందుకింత దౌర్జన్యం రేవంత్‌రెడ్డి? నీళ్లను ఒడిసి పట్టకుండా, విడిచిపెట్టి తెలంగాణకు జల ద్రోహం చేసింది మీరు.. తప్పు మీరు చేస్తే, శిక్ష రైతులు అనుభవించాలా? ఎల్ నినో సాకు చెప్పి పంటలకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటారా?’ అని తూర్పారబట్టారు. జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీళ్లు విడుదల చేయాలని, అదుపులోకి తీసుకున్న తమ నాయకులు, రైతులను విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
బాపూజీ నిబద్ధత స్ఫూర్తిదాయకం: హరీశ్
పదవుల కంటే ప్రజల పక్షాన నిలబడటమే నాయకత్వమని ఆచరణతో చూపిన గొప్ప దార్శనికుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని హరీశ్‌రావు కొనియాడారు. 1969 ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న ఆయన మలిదశ పోరాటంలోనూ ముఖ్యభూమిక పోషించారని గుర్తుచేశారు. బాపూజీ త్యాగం, నిబద్ధత స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

