హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు నడిరోడ్డెక్కి నిరసన తెలియచేయాల్సిన దుస్థితి దాపురించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాష్ట్రంలో గురుకులాలు అధ్వాన్న స్థితికి చేరితే, విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల ఖ్యాతిని కేసీఆర్ ఎవరెస్ట్ శిఖరం ఎత్తున నిలబెడితే.. రేవంత్రెడ్డి తన 11 నెలల పాలనలో దానిని అధఃపాతాళానికి దిగజార్చారని మండిపడ్డారు. మీ అసమర్థపాలనకు నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ గురుకుల విద్యార్థులు చేస్తున్న నిరసన మరో నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ రాజ్యంలో పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు నడిరోడ్డెక్కి నిరసన తెలియచేయాల్సిన దుస్థితి.
రాష్ట్రంలో గురుకులాలు అధ్వాన్న స్థితికి చేరితే, విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదు.
కెసిఆర్ గారు గురుకులాల ఖ్యాతిని ఎవరెస్ట్ శిఖరం ఎత్తున… pic.twitter.com/JY27ewC6TB
— Harish Rao Thanneeru (@BRSHarish) November 12, 2024
తమ హాస్టల్లో నాసికరకం ఆహారం పెడుతున్నారని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నాగర్కర్నూర్ జిల్లా వెల్దండ బీసీ గురుకుల విద్యార్థులు హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసుల హామీతో విద్యార్థులు తమ ఆందోళనను విరమించారు.