Harish Rao | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారు పాఠశాలలను మూసివేసే కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. జీరో సూల్ పేరిట 1,899 సూళ్లు, 10 మందిలోపు విద్యార్థుల కారణంగా 4,314 సూళ్లను కలిపి 6,213 ప్రభుత్వ పాఠశాలలను శాశ్వతంగా మూసివేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. ఇందులో భాగంగానే 5,741 మంది టీచర్లను బదిలీలు చేస్తున్నదని గురువారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘ప్రతి చిన్న గ్రామానికి ప్రాథమిక, ప్రతి రెవెన్యూ గ్రామానికి ప్రాథమికోన్నత, హైసూల్ చొప్పున ఏర్పాటు చేస్తామని అభయహస్తం మ్యానిఫెస్టోలో ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చి సంవత్సరం కాకముందే వేలాది స్కూళ్ల మూసివేయాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం 7,289 కోట్లతో మన ఊరు-మన బడి, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సన్నబియ్యంతో పౌష్ఠికాహారం అందించిందని, రేవంత్ సరారు వచ్చీ రాగానే సీఎం బ్రేక్ ఫాస్ట్ సీం రద్దు చేయడం, మన ఊరు మన బడి ప్రోగ్రాంను కొనసాగించక, పురుగుల అన్నం, విషాహారంతో మధ్యాహ్న భోజనం వల్ల ప్రభుత్వ పాఠశాలల పరపతి తగ్గి ఎన్రోల్మెంట్ తగ్గుతున్నదని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాజంలో కులవివక్ష, అసమానతలు రూపుమాపడానికి అలుపెరుగని కృషి చేసిన సంఘ సంసర్త ఫూలే అని ఎక్స్ వేదికగా ఆమె ప్రశంసించారు. ఫూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు.