 
                                                            రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఐఏఎస్, ఐపీఎస్‌లకు పోస్టింగులపై బీహారీ బ్యాచ్ అని మాట్లాడారు. మరిప్పుడు ఆయన చేస్తున్నదేమిటి? అర్హత గల తెలంగాణ బిడ్డలు శివధర్‌రెడ్డి, నాగిరెడ్డి, కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సీవీ ఆనంద్‌కు డీజీపీగా నియమించే అర్హత ఉన్నా పంజాబ్, బీహార్ బ్యాచ్ అయిన జితేందర్‌ను ఎందుకు నియమించారు?
ఆదిలాబాద్‌లోని తాంసీ మండలంలో విమల అనే మహిళకు రూ.59 వేల అప్పు ఉంటే రూ.3,434 రుణం మాఫీ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఇదేం లెక్క? ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయి.
– మాజీమంత్రి హరీశ్‌రావు
Harish Rao | హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని, గవర్నెన్స్ రావడం లేదని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు రోడ్డెక్కేలా ప్రభుత్వ పాలన తయారైందని విమర్శించారు. సోమవారం అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడిన ఆయన.. రుణమాఫీకి, రేషన్‌కార్డుకు సంబంధం లేదని సీఎం చెప్పినా.. రేషన్‌కార్డు నిబంధననే అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ అధ్యయనం ప్రకారం క్షేత్రస్థాయిలో 30-40 శాతం రైతులకు రుణమాఫీ అమలు కాలేదని చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ యోజనకు రుణమాఫీకి లింక్ పెడుతున్నారని తెలిపారు. ‘పీఎం కిసాన్ యోజనలో 18 ఏండ్లు దాటిన వారిని యాజమానితో సంబంధం లేకుండా లబ్ధిదారుడిగా పరిగణిస్తారు. కానీ రుణమాఫీలో ఆ లా చేయటం లేదు. ప్రభుత్వం రైతును గుర్తించాలి తప్ప కుటుంబంతో పనేమిటి? రుణమాఫీపై రైతు లు అయోమయానికి గురవుతున్నారు. పనులు వ దులుకొని అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. రేషన్‌కార్డు నిబంధన లేదని ఉత్తగా చెబితే కాదు.. కొత్త ఉత్తర్వులు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు విడుదల చేసినా, రాష్ట్రం మాత్రం నిధులివ్వటం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. పంచాయతీలో పారిశుద్ధ్యం గురించి తాను లేవనెత్తాకే కార్మికులకు జీతాలు అం దాయని.. జీతాలిచ్చినా, పంచాయతీలకు నిధులు ఇవ్వలేదని వెల్లడించారు. కేసీఆర్ హయాంలో ప్రతి నెల పంచాయతీలకు రూ.275 కోట్లు ఠంచనుగా విడుదల చేసేవాళ్లమని, మార్చి కన్నా ముందే కేంద్రం రూ.500 కోట్లు విడుదల చేసినా, వాటిని రాష్ట్రం విడుదల చేయటం లేదని విమర్శించారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టకపోవటం వల్ల మరో రూ.750 కోట్లు కేంద్రం విడుదల చేయలేదని వివరించారు.
అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదన్నారు. ఉపాధి హామీ కింద రూ.2,500 కోట్ల మె టీరియల్ కాంపోనెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఉపాధి హామీకి కేంద్రం రూ.800 కోట్లు విడుదల చేసినా రాష్ట్రం తన వాటాగా రూ.350 కోట్లు ఇవ్వటం లేదని వెల్లడించారు. కేంద్ర నిధులు 15 రోజుల్లో ఖర్చు చేయకపోతే వడ్డీ వసూలు చేస్తారని తెలిపారు. బిల్లులు రాక చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు నెలలుగా జీతాలు రావటం లేదని వివరించారు. రెండు నెలల నుంచి ఆసరా పింఛన్లు ఇవ్వటం లేదని, తాను నిలదీశాకే ఒక నెల పింఛను ఇచ్చారని తెలిపారు. మ ధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి జీతాలు కూడా తాము ప్రభుత్వం దృష్టికి తెచ్చాకే చలనం వచ్చిందని చెప్పారు. మన ఊరు మన బడి బిల్లులు ఇవ్వకపోవటంతో బాత్ రూములు కూడా తెరవని పరిస్థితి ఉన్నదని వెల్లడించారు. కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చు చేశారని, ఇప్పుడు వారిని బదిలీ చే శారని, ఆ డబ్బులు ఎవరివ్వాలని ప్రశ్నించారు.
పరిపాలన వైఫల్యంతో విద్యుత్తు శాఖను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. కరెంటు కోతలకు విచిత్ర కారణాలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. తొండలు, బల్లుల వల్లే కాదూ.. హరీశ్‌రావు చెప్తే కరెంటు తీసేస్తున్నారని అసంబద్ధ కారణాలు చెప్తున్నారని విమర్శించారు. గతానికి, ఇప్పటికి విద్యుత్తు వినియోగంలో తేడా లేకపోయి నా విద్యుత్తు అంతరాయాలు, కోతలు ఉంటున్నాయని వెల్లడించారు. ‘రైతులు డీడీలు కట్టినా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వటం లేదు.
ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటంతో పంచాయతీలు, మున్సిపాలిటీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు కరెంటు బిల్లులు కట్టడం లేదు. గృహలక్ష్మి పథకం నిధులను ప్రభుత్వం ట్రాన్స్‌కోకు విడుదల చేయకపోవటంతో సంస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. 91 లక్షల మందికి తెల్లరేషన్ కార్డులు ఉం టే కనీస సంఖ్యలో కూడా పథకం అమలు కావటం లేదు. పోలీసులకు పెట్రోల్, డీజిల్ డబ్బులు కూడా ఇవ్వటం లేదు. హోం గార్డులకు జీతాలు సరిగా రా వడం లేదు.
కల్యాణలక్ష్మి, షా దీముబారక్కు తులం బంగారం ఇవ్వటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష చెకులు పెండింగ్‌లో ఉన్నాయి. సిద్దిపేటలోనే 3 వేలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. రైతుబీమా చెకులు నెల దాటినా రావడం లేదు. కేసీఆర్ హ యాంలో వారంలో రూ.5 లక్షల బీమా చెక్కు వచ్చే ది. సంక్షేమ హాస్టళ్లలో పనిచేసే వారికి 8 నెలలుగా వేతనాలు రావటం లేదు’ అని వివరించారు.
కాంగ్రెస్ పాలనలో కంచెలు తీసేస్తామని చెప్పి, కొత్త కంచెలు తెచ్చారని హరీశ్‌రావు విమర్శించారు. ‘అసెంబ్లీ చుట్టూ కంచెలు పెంచారు. నాలుగు అంచెల కంచెలు తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు అత్యవసర పనుల కోసం గతంలో నెలకు రూ.40 లక్షలు ఇచ్చేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అవి 7 నెలలుగా బంద్ అయ్యాయి. నగరంలో చాలా డివిజన్లు చెత్తకుప్పలతో దర్శనమిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఫిర్యాదుల విభాగం పనితీరు అస్తవ్యస్థంగా మారిం ది. గ్రీవెన్స్‌సెల్‌లో 130 శాతం దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. చాలా మంది సిబ్బందికి 1న జీతా లు రావడం లేదు.
ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. దవాఖానల్లో డాక్టర్ల బదిలీలు అస్తవ్యస్థంగా మారాయి. బదిలీల్లో పారదర్శకత లేదు. కనీస సౌకర్యాలు లేని దవాఖానలకు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను నియమించారు. వారిని అక్కడ నియమించటం వల్ల రోగులకే నష్టం, ఇబ్బంది తప్ప, డాక్టర్లకు ఎలాంటి నష్టం ఉండదు. సీనియర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల సేవలను సరైన విధంగా ఉపయోగించి రోగులకు సేవలు అందించాలి. రాష్ట్రంలో ప్రతి వర్గం రోడ్డెక్కేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉన్నది. రోడ్డెకని వర్గమే లేదు. 2 వేల పడకల దవాఖానలకు సూపరింటెండెంట్‌గా పనిచేసిన వారిని వంద పడకల దవాఖానలకు పంపారు’ అని మండిపడ్డారు.
‘ఐఏఎస్, ఐపీఎస్‌లకు పోస్టింగ్‌ల విషయంలో రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా బీహార్ బ్యాచ్ అని మాట్లాడారు. ఆనాడు మాట్లాడింది ఏమిటి? ఇప్పుడు రేవంత్ చేస్తున్నదేమిటి?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. తాను బీహార్, పంజాబ్, ఇతర రాష్ట్రాల అధికారులకు వ్యతిరేకం కాదని, రేవంత్ అన్న మాటలనే గుర్తుచేస్తున్నానని స్పష్టం చేశారు. ఈ అధికారుల గురించి రేవంత్ నాడు ఏమన్నారో అన్నీ బయటపెడతానని ప్రకటించారు. బీహారీలంటే దోపిడీదారులని నాడు రేవంత్‌రెడ్డి అన్నారని, అప్పుడు వద్దన్నవారు.. ఇప్పుడు ముద్దు ఎలా అయ్యారని నిలదీశారు. ఆనాడు తెలంగాణకు చెందిన మహేందర్‌రెడ్డిని డీజీపీగా నియమిస్తే, ఆయనపై రేవంత్‌రెడ్డి ఎన్నో ఆరోపణలు చేశారని, ఇప్పుడు ఆయనను టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించారని గుర్తుచేశారు.
సందీప్‌కుమార్ సుల్తానియాపై ఆరోపణలు చేసి ఇప్పుడు ఆయనకు అత్యంత కీల శాఖలు అప్పగించారని తెలిపారు. సర్వీసెస్‌లో దివ్యాంగులు పనికిరారని స్మితాసబర్వాల్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని అభిప్రాయపడ్డారు. సిద్దిపేటలో అమలు చేసిన కొన్ని వినూత్న కార్యక్రమాలకు కేంద్ర ఆర్థికసర్వేలో చోటు లభించడం సంతోషం అని అన్నారు. స్టీల్ బ్యాంకు కాన్సెప్ట్‌ను ఆర్థిక సర్వే లో ప్రత్యేకంగా ప్రస్తావించారని పేర్కొన్నారు.
 
                            