హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అధికారం కోసం జెండాలు, ఎజెండాలను పకనపెట్టి అధికార పీఠం కోసం ఎంతలా దిగజారవచ్చో కాంగ్రెస్, బీజేపీ నేడు నిరూపించాయని, కాంగ్రెస్ పదేపదే చెప్తున్న మార్పు అంటే బీజేపీతో జతకట్టడమేనా? అని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. 12 ఏండ్లుగా బీఆర్ఎస్ను బీజేపీకి బీటీమ్ అని కాంగ్రెస్, కాంగ్రెస్‌కు బీటీమ్ అని బీజేపీ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని, ఆ రెండు పార్టీలు తెలంగాణ వ్యతిరేక టీమ్ అని నిరూపించుకున్నాయని సోమవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్ సింగిల్ టీమ్‌గా మారిపోయిందని, ఈ అపవిత్ర కలయిక, అనైతిక పొత్తును ప్రజలు గుర్తించారని విమర్శించారు.
బీజేపీ, కాంగ్రెస్ బంధం మరోసారి స్పష్టం
‘రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఈరోజు మున్సిపల్ ఎన్నికలతో మరోసారి స్పష్టమైంది. కేవలం బీఆర్ఎస్ను అడ్డుకోవడమే లక్ష్యంగా ఆ రెండు పార్టీలు సిద్ధాంతాలను గాలికొదిలేశాయి’ అని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని మున్సిపల్ ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. ఢిల్లీలో కొట్టుకుంటూ, గల్లీలో మాత్రం చేతులు కలుపుతూ వాటాలు వేసుకొని పదవులు పంచుకుంటున్నరు. దీనికి అలియాబాద్, ఆమనగల్, మెదక్, నర్సాపూర్ ఫలితాలే ప్రత్యక్ష సాక్ష్యం. రేవంత్‌రెడ్డీ.. మీరు నడిపేది కాంగ్రెస్ సరారా? బీజేపీ సరారా? బీజేపీ, టీడీపీతో కూడిన సంకీర్ణ సరారా? అలియాబాద్ నుంచి ఆమనగల్ దాకా, మెట్పల్లి నుంచి మెదక్ దాకా మీరు సాగిస్తున్న ఈ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నరు’ అంటూ తూర్పారబట్టారు.
బీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా లేకనే
‘కాంగ్రెస్‌కు ఒంటరిగా బీఆర్ఎస్ను ఎదురొనే సత్తా లేదు. అందుకే సిగ్గు వదిలి బీజేపీతో కుమ్మకైంది. రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ను నిలువరించి అధికారాన్ని చేపట్టడానికి ఏదో ఒక విధంగా ఫలితాలను తారుమారు చేస్తూ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నయి’ అని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రాహుల్ కాంగ్రెస్సేమో దేశమంతా బీజేపీ మీద పోరాటం చేస్తుంటే.. ఇకడ రేవంత్ కాంగ్రెస్సేమో బీజేపీతో జత కడుతున్నది. రాహుల్.. ఢిల్లీలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నరు. తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నరు. దానికి ఈ పొత్తులే సాక్ష్యం’ అని ధ్వజమెత్తారు.
రెండు పార్టీల దిగజారుడు రాజకీయం
‘ కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డిని, బండి సంజయ్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నా.. మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికకు బీజేపీ కాంగ్రెస్‌తో కలిసింది మీకు తెలియదా? తెలిసే చేశారా? ఢిల్లీలో పెద్దలు కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటారు. ఇకడ మీరేమో కాంగ్రెస్ యుక్త్ బీజేపీ అని నిరూపిస్తున్నరు’ అంటూ హరీశ్ నిప్పులుచెరిగారు. ‘బీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న బలాన్ని చూసి భయపడే మీరు ఈ కుట్రలకు తెరలేపారు. సింగిల్‌గా మా పార్టీని ఎదురొనే దమ్ములేక రెండు జాతీయ పార్టీలు ఒకటై దాడి చేస్తున్నయి. ఇది మా విజయానికి నిదర్శనం కాక మరేంటి? బీఆర్ఎస్ అత్యధిక వార్డులు గెలుచుకున్న చోట్ల కూడా కుట్రలు చేసి పదవులు దకించుకున్నరు. నర్సాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కాంగ్రెస్ తీసుకుని, వైస్ చైర్మన్ పదవి బీజేపీకి ఇచ్చారంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం మరొకటి ఉంటదా? ఒక పక నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటరు. మరోపక ఉత్తర తెలంగాణలో బీజేపీతో జతకడుతరు. ఇదేనా ప్రజా పాలన? సిర్పూర్ కాగజ్‌నగర్, మెట్పల్లిలో కూడా ఇదే తంతు. చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవులను బీజేపీ, కాంగ్రెస్ పంచుకోవడం రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా గమనిస్తున్నరు’ అని విమర్శించారు.
ఇవీ మీ అనైతిక పొత్తులకు నిదర్శనాలు
చైర్మన్ పీఠాలు హైజాక్
‘క్యాతనపల్లి, తొర్రూరు, జనగామ, జహీరాబాద్ లాంటి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు ప్రజలు మెజారిటీ సీట్లు కట్టబెట్టినా అకడ ప్రజా తీర్పును గౌరవించకుండా అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని చైర్మన్ పీఠాలను హైజాక్ చేయాలని చూస్తున్నరు’ అంటూ హరీశ్ నిప్పులు చెరిగారు. ‘కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ అధికారులను పావులుగా వాడుకుంటూ ఎలాగైనా అందలం ఎకాలని కాంగ్రెస్, బీజేపీ కుటిల రాజకీయాలకు తెరలేపాయి. కాంగ్రెస్ ముసుగులో బీజేపీ, బీజేపీ ముసుగులో కాంగ్రెస్ పనిచేస్తున్నయి. ఈ అపవిత్ర కలయికను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నది. రాబోయే రోజుల్లో ప్రజలే ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్తరు’ అని హెచ్చరించారు.
సింగిల్‌గా బీఆర్ఎస్ను ఎదురొనే దమ్ములేక రెండు జాతీయ పార్టీలు ఒకటై దాడి చేస్తున్నయి. ఇది మా విజయానికి నిదర్శనం కాక మరేంటి? బీఆర్ఎస్ అత్యధిక వార్డులు గెలుచుకున్న చోట్ల కుట్రలు చేసి పదవులు దకించుకున్నరు. నర్సాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కాంగ్రెస్ తీసుకుని, వైస్ చైర్మన్ పదవి బీజేపీకి ఇచ్చారంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం మరొకటి ఉంటదా? ఒక పక నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటరు. మరోపక ఉత్తర తెలంగాణలో బీజేపీతో జతకడుతరు.ఇదేనా ప్రజా పాలన?
-హరీశ్‌రావు