హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి పొత్తుకు సాక్ష్యమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే కిషన్‌రెడ్డి కొనసాగిం చారని దుయ్యబట్టారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని నిర్మించడం అబద్ధమా? 148 మీటర్ల దిగువ ప్రాంతం నుంచి 618 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం అబద్ధమా? ఈ రోజు, ఈ నిమిషానికి మండుటెం డల్లో సైతం కాళేశ్వరం ప్రాజెక్ట్ కాలువల ద్వారా జలాలు రైతుల పొలాలకు చేరుతుండటం అబద్ధ మా? ఏది అబద్ధం కిషన్రెడ్డీ? పంట పొలాల్లో పారుతున్న కాళేశ్వరం జలాలను చూపించేందుకు నేను సిద్ధం. మరి వచ్చేందుకు మీకు దమ్ముందా?’ అని హరీశ్‌రావు సవాల్ విసిరారు. ‘మీరు క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు.
ఏ ప్రభుత్వమైనా ప్రజాధనం తోనే నిర్మాణాలు చేస్తుందన్న విషయం మరచి కేసీఆర్ జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టారా అని అడగడం మీ అవివేకానికి, అతి తెలివికి నిదర్శనం. బీజేపీ ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ రహదారులు, ప్రాజెక్టులకు మీ సొంత పైసలు ఖర్చు పెడు తున్నారా? ఆ నోట్లను దుబాయ్‌లో ముద్రిస్తు న్నారా? లేక మీ జేబుల్లో నుంచి ఖర్చు చేస్తున్నా రా? కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదని గొంతు చించుకున్న కిషన్రెడ్డీ.. గతంలో మీ ప్రభుత్వ పెద్దలే నితిన్గడరీ నుంచి సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ వరకు కాళేశ్వరంపై కురిపించిన ప్రశంసలు అబద్ధం అంటారా? అవివేకం అంటారా? తాజా పార్లమెం ట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా (చాప్టర్ 8) రిపోర్ట్ ప్రకారం..
‘2014లో తెలంగాణలో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం, 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకాలే’నని కుండబద్దలు కొట్టింది. ఇది మీ కండ్లకు కనిపించడం లేదా? సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిందే చెవుల్లోకి వెళ్తుందా?’ అని నిలదీశారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ గొంతు కోసేలా కిషన్‌రెడ్డి మా ట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజ్యస భలో కిషన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు, చరిత్ర వక్రీకర ణలతో వికృతత్వాన్ని బయట పెట్టుకున్నారని మం డిప డ్డారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయక వెన్నుచూపి పారిపోయిన కిషన్‌రెడ్డి నేడు మరోసారి ద్రోహానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు.