హైదరాబాద్: రాష్ట్రంలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదుచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఫోన్ టాపింగ్పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు వెళ్లిన.. ఎమ్మెల్యేపైనే మళ్లీ ఉల్టా కేసు బనాయించారని విమర్శించారు. ఇదేం విడ్డూరమని, ఇదెక్కడని న్యాయమని ప్రశ్నించారు. మీ పాలన మార్పు మార్కు ఇదేనా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఒక ఎమ్మెల్యే ఫిర్యాదుపై చర్య తీసుకునేందుకు వెనుకాడుతున్నారని మండిపడ్డారు. ప్రజల తరపున పోరాంటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది లేదని, బెదిరేది లేదన్నారు. ప్రజాక్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటామని, నీ వెంట పడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
‘ఫోన్ టాపింగ్ పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకడుతరు, మళ్ళీ ఉల్టా కేసు బనాయిస్తరు? ఇదేం విడ్డూరం. ఇదెక్కడి న్యాయం? ఇదేం ప్రజాస్వామ్యం? రేవంత్ మీ పాలన మార్పు మార్కు ఇదేనా?
రాజ్యాంగాన్ని కాపాడుదామని రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతడు. నువ్వేమో తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూనే ఉంటవు. ప్రజల తరుపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది లేదు, బెదిరేది లేదు. ప్రజాక్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటాం. నీ వెంట పడుతూనే ఉంటం.’ అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.
ఫోన్ టాపింగ్ పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఎమ్మెల్యే @KaushikReddyBRS గారి పై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకడుతరు, మళ్ళీ ఉల్టా కేసు బనాయిస్తరు?
ఇదేం విడ్డూరం.
ఇదెక్కడి న్యాయం?…— Harish Rao Thanneeru (@BRSHarish) December 5, 2024