హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రోజురోజుకూ పరిస్థితులు చేజారిపోతున్నాయనే సత్యం జీర్ణం కాకనే అవాకులు చవాకులు పేలుతూ అకసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. త్వరలోనే తనకు పతనం తప్పదనే సంగతి అర్థమైపోవడం వల్లే రేవంత్‌రెడ్డి ఆగమాగం అవుతున్నారని దుయ్యబట్టారు. త్వరలోనే తన కుర్చీ ఊడుతుందని, తన దోపిడీ ఆగిపోతుందన్న భయంతోనే రేవంత్‌రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. తనకు, కేటీఆర్‌కు మధ్య మిత్రబేధం సృష్టించాలని, తద్వారా బీఆర్ఎస్ను బలహీనపరచాలనే చీప్ ట్రిక్ ప్లే చే స్తున్న రేవంత్‌రెడ్డి ఎత్తులు పారవని హెచ్చరించారు. ‘రేవంత్‌రెడ్డీ.. తమరి చీప్ ట్రికులకు, చిల్లర రాజకీయాలకు ఎవరూ పడిపోరు. నీ కుట్రలు, కుతంత్రాలు ఫలించవు గాక ఫలించవు. గతంలో అనేకసార్లు చెప్పిన. మళ్లీ చెప్తున్నా.. రాసి పెట్టుకో. ఎప్పటికైనా హరీశ్‌రావు గుండెల్లో ఉండేది కేసీఆరే, హరీశ్‌రావు చేతిలో ఉండేది గు లాబీ జెండానే. తమరి దాష్టీకాలు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా కేటీఆర్‌తో కలిసి మ రింత సమన్వయం, మరింత సమర్థంగా రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతాం’ అని హరీశ్‌రావు హెచ్చరించారు.
ఉద్యమం నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతామని, ఇదే తన లక్ష్యమైనా, కేటీఆర్ లక్ష్యమైనా, లక్షలాది గులాబీ సైనికుల లక్ష్యమైనా అని హరీశ్‌రావు సవాల్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ విజయపథంలో పురోగమించడం, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చడం ఖాయమైందని పేర్కొన్నారు. తమరి చిల్లరవేషాలు, చెత్త రాజకీయాలు చూసి ప్రజలు ఛీ కొడుతున్నారని, ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని అని హితవు పలికారు. మిగిలిన కొద్దికాలమైనా ప్రజలకు అకరకు వచ్చే ప నులు చేయాలని, లేకుంటే ఉద్యమద్రోహి గానే కాదు, చేవలేని, చేతగాని సీఎంగా చరిత్రలో నిలిచిపోతావని దుయ్యబట్టారు.