Harish Rao | సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో రైతులతో మాజీ మంత్రి హరీశ్‌రావు ముచ్చటించారు. బావి వద్ద మధ్యాహ్నం భోజనం చేస్తున్న మొక్కజొన్న రైతులను హరీశ్‌రావు ఆత్మీయంగా పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
యూరియా కోసం రేవంత్ రెడ్డి రైతులను తిప్పలు పెట్టిండని హరీశ్‌రావుతో మొక్కజొన్న రైతులు తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనలో అందరిని ఆగం చేస్తుండని అన్నారు. రేషన్ షాపుల్లోఇస్తున్న సన్న బియ్యంతో అన్నం ముద్ద అవుతుందని.. మంచిగా ఉంటలేదని తెలిపారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం రంగనాయక సాగర్ నిర్మించిన తర్వాత తమకు నీళ్ల ఇబ్బందులు పోయాయని రైతులు తెలిపారు. రెండు పంటలు కాదు మూడు పంటలు పండిస్తున్నామంటే మీరు తెచ్చిన కాళేశ్వరం నీళ్ళే సార్ అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత వ్యవసాయానికి సరిపడ కరెంట్ ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నపుడు మంచిగా ఉండే అని తమ అభిప్రాయం చెప్పారు. మిర్చి పంట వేయక ముందు మేము గుడిసెల్లో నివాసం ఉండేవాళ్లమని.. మీ దయతో మిర్చి పంట వేశాక భవనాలు కట్టుకున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి తమకు రుణమాఫీ చేయలేదని.. మీరే చేయించాలని హరీశ్‌రావును కోరారు.
పొలాల వద్ద సద్ది తింటున్న మొక్కజొన్న రైతులతో ఆత్మీయంగా ముచ్చటించిన @BRSHarish గారు…
– యూరియా కోసం రేవంత్ రెడ్డి రైతులను తిప్పలు పెట్టిండు…
– రేవంత్ రెడ్డి పాలనలో అందరిని ఆగం చేస్తుండు..
– సన్న బియ్యం తో అన్నం ముద్ద అవుతుంది… మంచిగా ఉంటలేదు..
– కాళేశ్వరం రంగనాయక… pic.twitter.com/llrlXpnkGC
— Office of Harish Rao (@HarishRaoOffice) October 19, 2025