మూసీపై ఎలాంటి ముందస్తు ప్రణాళిక, డీపీఆర్ లేకుండా 280 కుటుంబాల ఇండ్లు కూల్చారు. వర్షం వస్తున్నా పట్టించుకోకుండా వారిని రోడ్డున పడేశారు. వారి మానసిక క్షోభను ఎలా భర్తీ చేస్తావ్ రేవంత్
Harish Rao | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రజలతోపాటు పార్లమెంటును సైతం సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూసీ బాధితులకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. పార్లమెంట్లో బుధవారం బీఆర్ఎస్ ఎంపీ సురేశ్‌రెడ్డి మూసీ బాధితుల పరిహారంపై ప్రశ్నిస్తే భూసేకరణ చట్టం -2013 అమలుచేస్తున్నట్టు చెప్పారని విమర్శించారు. మూసీ బాధితులకు పరిహారం విషయంలో పార్లమెంట్‌కు చెప్పిన అంశాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, ఎకడికి రావాలో ముఖ్యమంత్రి చెప్పాలని సవాల్ విసిరారు. ‘బుల్డోజర్ ఎక్కించి చంపుతా.. తొకుతా.. ఇలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుడు కాదు రేవంత్‌రెడ్డి.. నేను ఎకడికి రావాలన్నా సిద్ధం. బహిరంగ సవాల్ చేస్తున్న.. టీవీ చర్చకా? సెక్రటేరియట్కా? ఆల్ పార్టీ మీటింగ్‌కా? ఎకడికి రావాలో చెప్పు.. అని హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని కేటీఆర్‌తోపాటు తాను కూడా డిమాండ్ చేశానని, మరి ఎందుకు పెట్టలేదని నిలదీశారు.
తెలంగాణభవన్‌లో గురువారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, బీఆర్ఎస్ నేతలు విప్లవ్‌కుమార్, శివకుమార్‌తో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘2013 భూసేకరణ చట్టం ప్రకారం.. ముందుగా పబ్లిక్ నోటీసు ఇవ్వాలి. అభ్యంతరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పరిషరించి ముందుకు వెళ్లాలి. ఏ ఇల్లు అయినా ఆ ఇంటికి ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులు వెళ్లి పాత ఇంటికి ఎంత విలువ ఉంటుందో అంచనా వేయాలి. రెండింతలు డబ్బును ఇంటి యజమానికి ఇవ్వాలి. ఉపాధి కోల్పోయిన వారికి వేజ్లాస్ కింద రూ.7.5 లక్షలు ఇవ్వాలి. పెళ్లి కాని వారికి రూ.5 లక్షలు ఇవ్వాలి. వివాహితులకు 250 గజాల స్థలం, డబుల్ బెడ్ రూం ఇవ్వాలి. ఆ ఇంటికి కరెంటు, రోడ్డు, దవాఖాన, దేవాలయాలు వంటి అన్ని వసతులు అందుబాటులో ఉండేలా కాలనీ నిర్మించి ఇవ్వాలి. కానీ, ఒకటీ అమలు కాలేదు. నిజానికి డబుల్ బెడ్ రూం ఇండ్లను సేలబుల్ అంటే అన్ని హకులతో ఇవ్వాలి. కానీ, కేసీఆర్ కట్టించిన ఇండ్లను కేవలం అసైన్డ్ పేపర్ ఇచ్చి పంపించారు. అంటే వారికి ఆ ఇండ్ల మీద ఎలాంటి హకులు ఉండవు. ప్రజలను, పార్లమెంట్‌ను కూడా మోసం చేసిండు రేవంత్‌రెడ్డి. మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి ఆయనే ఉండి ఆయనకు తెలిసి కూడా కేంద్రానికి తప్పుడు సమాచారం అందించారు. దానినే పార్లమెంట్లో సమాధానంగా కేంద్ర మంత్రి చెప్పారు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.
2013 భూసేకరణ చట్టం ప్రకారం ముందుగా పబ్లిక్ నోటీసు ఇవ్వాలి. అభ్యంతరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పరిషరించి ముందుకు వెళ్లాలి. ఇంటికి ఎంత విలువ ఉంటుందో అంచనా వేసి రెండింతలు డబ్బును యజమానికి ఇవ్వాలి. ఉపాధి కోల్పోయిన వారికి వేజ్లాస్ కింద రూ.7.5 లక్షలు ఇవ్వాలి. కానీ ఒక్కటైనా అమలు చేశావా రేవంత్.
‘మూసీ ప్రాజెక్టు కారణంగా నష్టపోతున్న, నిర్వాసితులు అవుతున్నవారిని ముందు గుర్తించాలి. కానీ, అలా చేయలేదు. అసైన్డ్ భూమి అయినా, ఎన్‌క్రోచ్‌మెంట్ అయినా, పట్టాభూమి అయినా, ప్రభుత్వ భూమిలో ఉన్నా అందరికీ సమాన హకులు ఉంటాయని చట్టం చెప్పింది. ముందుగా ఎన్యుమరేషన్ జరగాలి. 60 రోజుల సమయం ఇస్తూ దినపత్రికల్లో నోటీసు ఇవ్వాలి. వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని పరిషరించాలి. 30 రోజుల వ్యవధితో మరో నోటీసు ఇవ్వాలి. అప్పుడు ప్రక్రియ ప్రారంభించాలి. కానీ ఇకడ నోటీసులు లేవు, డీపీఆర్ లేవు, ఎన్యుమరేషన్ లేదు. ఇవేవి లేకుండా నేరుగా ఇండ్లు కూలగొట్టి బాధితులను రోడ్డున పడేసి.. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారు’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూసీ ప్రాజెక్టు పరిహారంపై పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానంతో రాష్ట్ర కాంగ్రెస్ మోసపూరిత వైఖరి బయటపడిందని వివర్శించారు. మూసీ నిర్వాసితులకు భూసేకరణ చట్టం 2013ను అమలు చేస్తున్నామని పచ్చి అబద్ధ్దం చెప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రానికి రేవంత్‌రెడ్డి సర్కారు చెప్తున్నదొకటి.. ఇకడ అమలు చేస్తున్నది మరొకటని మండిపడ్డారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై వాస్తవాలను దాచిపెడుతున్నదని విమర్శించారు.
కుటుంబాలు ఉంటున్న ఇండ్లను ఇకపై కూల్చబోమని ఇప్పుడు చెప్తున్నారని, ఇప్పటికే కూల్చినవేసిన ఇండ్ల సంగతి ఏమిటని నిలదీశారు. కూల్చివేసిన ఇండ్లకు ఎవరు బాధ్యులు? అని ప్రశ్నించారు. ‘హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చారు. ఇంట్లో ఉన్న పుస్తకాలు తెచ్చుకుంటా అని చిన్నపాప అడిగినా కనికరించలేదు. ఇండ్లు కూల్చారు. కట్టుబట్టలతో ఇండ్ల నుంచి బయటకు గెంటేశారు. దీనికి ఎవరు బాధ్యులు? నష్టపరిహారం ఇచ్చినా వారు పడిన బాధ పోదు. మూసీ విషయంలోనూ అదే పరిస్థితి. కూలిన ఇండ్లకు నష్టపరిహారం ఎలా చెల్లిస్తావు. పేదల ఉసురు పోసుకుంటున్నావు. రాష్ట్రం పరువు తీస్తున్నావు’ అని రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు.
‘ఓల్డ్ మలక్‌పేటలోని శంకర్‌నగర్‌లో ముజాహిత్, షాహిన్‌బేగం దంపతులకు 8 గదుల ఇల్లు ఉండే. బిడ్డా, కొడుకులు, మనుమళ్లు, మనుమరాళ్లతో 8 గదుల్లో 16 మంది ఉండేవాళ్లు. వీరి ఇల్లు కూలిగొట్టి కేసీఆర్ కట్టించిన ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చి వెళ్లిపోండి అన్నరు. చట్టం ప్రకారం వారికి ఐదు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలి. కానీ, ఒక్కరికే ఇవ్వడంతో మిగతా నాలుగు కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో కిరాయి ఇండ్లలో ఉంటున్నాయి. ప్రభుత్వ చర్యల వల్ల ఇలాంటి అనేక కుటుంబాలు విచ్ఛిన్నం అయ్యాయి. మానవత్వంతో ఇండ్లు ఇస్తున్నామని పార్లమెంట్‌కు చెప్పారు. మానవత్వం కాదు హకుగా బాధితులకు ఇండ్లు ఇవ్వాల్సిందే’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని, మూసీ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడానికి వ్యతిరేకమని స్పష్టంచేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రారంభించిందే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని గుర్తుచేశారు. అవాస్తవాలు చెప్పడంపై పార్లమెంట్లో తమ ఎంపీ సురేశ్‌రెడ్డి, ఇతర ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారని వెల్లడించారు. నిరుపేదల పక్షాన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయస్థానాలకు సైతం వెళ్తామని, చట్టం ప్రకారం ఆ పేదలకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తామని స్పష్టంచేశారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని, మూసీ బాధితులకు పూర్తి అండగా ఉండి పోరాటం చేస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సోనియా గాంధీని గతంలో బలిదేవత అన్నరు. ఇప్పుడు తల్లి అంటున్నరు. వరంగల్‌లో సీఎం మాట్లాడుతూ.. సోనియా కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటా అన్నరు. నిజంగా ఆమె మీద గౌరవం ఉంటే నాటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం 2013ను మూసీ బాధితులకు అమలు చెయ్యి రేవంత్
కేసీఆర్ నాయకత్వంలో కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్, పాలమూరు ఎత్తిపోతల, సీతారామ ప్రాజెక్టుల్లో భూసేకరణ చట్టం 2013 కంటే తాము తెచ్చిన మెరుగైన 2014 చట్టాన్ని అమలు చేశామని హరీశ్‌రావు గుర్తుచేశారు. ‘కేసీఆర్ కూడా ఒక నిర్వాసిత కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి నిర్వాసితుల గురించి గొప్ప ఆలోచన చేశారు. నిర్వాసితులకు 121 గజాల స్థలంలో ఐఏవై ఇల్లు కట్టించాలని 2013 చట్టంలో ఉంటే.. కేసీఆర్ 250 గజాల స్థలంలో డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఐఏవై ఇల్లు అంటే ఆ రోజు రూ. 1.20 లక్షలు మాత్రమే. మేం కట్టించిన డబుల్ బెడ్రూం ఇల్లు అంటే రూ.5-6 లక్షలు. వేజ్లాస్ (ఉపాధి) కూడా పెంచాం. 18 ఏండ్లు నిండినవారికి రూ.5 లక్షలు ఇచ్చాం. ఇండ్లు కట్టించి ఇచ్చాం. దేశంలోనే గొప్పగా ఆర్అండ్ ఆర్ కాలనీ నిర్మించాం. 99.1 శాతం నిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారం చెల్లించాం’ అని హరీశ్‌రావు గుర్తుచేశారు.