Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు సిట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి కాసేపటిక్రితం ఆయన చేరుకున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని మాజీ మంత్రి హరీశ్‌రావుకు సోమవారం రాత్రి సిట్ నోటీసు ఇచ్చింది. ఆయన ఇంట్లో లేని సమయంలో నానక్‌రామ్‌గూడలోని నివాసంలో అంటెండర్‌కు నోటీస్ అందజేసింది. పంజాగుట్టలో నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 యూ/సెక్షన్.166, 409, 427, 201, 120 (బీ) ఆర్/డబ్ల్యూ, 34 ఐపీసీ, పీడీపీపీ యాక్ట్‌లోని సెక్షన్ 3, ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 65, 66, 66 (ఎఫ్)(1)(బీ)(2), 70 ఆధారంగా విచారణకు హరీశ్‌ను పిలిచారు. ‘ఈ కేసులో ఇప్పటి వరకూ జరిగిన విచారణలో మీకు కొన్ని వాస్తవాలు, పరిస్థితుల గురించి తెలిసినట్లు వెల్లడైంది. కాబట్టి ఈ నోటీసు అందిన వెంటనే, తదుపరి విచారణ నిమిత్తం ఈనెల 20న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరుకావలసిందిగా కోరడమైనది’ అంటూ సిట్ అధికారి వెంకటగిరి పేరుతో నోటీస్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే హరీశ్‌రావు ఇవాళ విచారణకు హాజరయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కోసం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి చేరుకున్న హరీష్ రావు https://t.co/Hfxbk13rSc pic.twitter.com/OKeHfvsko3
— Telugu Scribe (@TeluguScribe) January 20, 2026