హైదరాబాద్: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో మరికాసేపట్లో కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్యే కవితతోపాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నందీనగర్‌లోని కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, కౌశిక్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, శంభీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, బాల్క సుమన్, గాదరి కిశోర్, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, రాకేశ్ రెడ్డి, క్రిశాంక్‌తోపాటు పార్టీ శ్రేణులు భారీగా కేటీఆర్ నివాసానికి వచ్చారు.
కాగా, తన లీగల్ టీమ్‌లో కేటీఆర్ భేటీ అయ్యారు. మాజీ ఏఏజీ రామచంద్రారావు కేటీఆర్‌తోపాటు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. దీంతో ఏసీబీ విచారణను ఏవిధంగా ఎదుర్కోవాలని వారితో సమాలోచనలు చేస్తున్నారు.