KCR | మన స్వయంపాలన దేశానికే ఆదర్శం.. అమరులకు అదే నిజమైన నివాళి: కేసీఆర్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వ రాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భం లో రాష్ట్ర సాధన కోసం సాగిన పో రాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దశాబ్ది వేడుకలను ముగించుకునే సందర్భంలో అమరులకు ముందుగా నివాళి అర్పిద్దామని పేర్కొన్నారు.
- ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
KCR | హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వ రాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భం లో రాష్ట్ర సాధన కోసం సాగిన పో రాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దశాబ్ది వేడుకలను ముగించుకునే సందర్భంలో అమరులకు ముందుగా నివాళి అర్పిద్దామని పేర్కొన్నారు. ప్రజాస్వామిక వాతావరణంలో పార్లమెంటరీ పంథాలో బీఆర్ఎస్ పార్టీ అస్థిత్వ రాజకీయ వేదికగా ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. రాష్ట్ర సాధనకోసం భావజాలవ్యాప్తి సాగించి తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను సకలజనులకు బోధించి, పోరాటంలో సబ్బండ వర్గాలను సమీకరించి అనేక వ్యూహాలను, ఎత్తుగడలను అమలుపరిచి కేంద్రాన్ని కదిలించి, తెలంగాణకు సానుకూలంగా దేశంలోని మెజారిటీ రాజకీయ పార్టీలను ఒప్పిం చి, తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన చారిత్రక సందర్భాలను కేసీఆర్ గుర్తుచేసుకున్నా రు. అనేక త్యాగాలకోర్చి సాధించుకున్న తెలంగాణను అన్నిరంగాల్లో పటిష్ట పరుచుకుంటూ సమర్థవంతంగా పాలనను అం దించిన పదేండ్ల స్వయంపాలనాకాలం దేశానికి అభివృద్ధి, సంక్షే మ రంగాల్లో తెలంగాణను ఒక రోల్ మోడల్‌గా నిలిపిందని పే ర్కొన్నారు. అమరుల త్యాగాల ను వృథా పోనీయకుండా ప్రజ ల భాగస్వామంతో సాధించిన ప్రగతిని, ప్రజాసంక్షేమాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని ఆకాంక్షించారు.
రాగద్వేషాలకు తావివ్వకుండా
బాధ్యతతో, చిత్తశుద్ధితో, వ్యక్తిగత ద్వేష భావనలకు తావివ్వకుండా తెలంగాణ సమా జ ప్రగతి, సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన నిజమైన ప్రజాసంక్షేమ పాలన స్ఫూర్తినందుకొని ముందుకుసాగడం ద్వారానే ప్రస్తుత ప్రభుత్వం అమరుల ఆకాంక్షలను నెరవేర్చగలదని కేసీఆర్ పేర్కొన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుం టూ వారికి ఘన నివాళి అర్పించేందుకు శనివారం కొనసాగిన అమరజ్యోతుల (కొవ్వొత్తుల) ర్యాలీని విజయవంతం చేయడం పట్ల పార్టీ శ్రేణులకు, తెలంగాణ వాదులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. జూన్ 2, జూన్ 3 తేదీల్లో బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాల ము గింపు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

