హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఈ నూతన సంవత్సరంలో పాడిపంటలతో తులతూగాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ వాసులు, దేశవిదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదిలో కొత్త ఆలోచనలు, ఆకాంక్షలు, సుస్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నతంగా ఎదగాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో కొత్త సంవత్సరంలో నూతన ఆలోచనలతో లక్ష్యాలను సాధించాలని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. రాష్ట్ర ప్రజలకు ప్రకటనలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో మంచి ఫలితాలు సాధించే విధంగా ప్రతి ఒక్కరూ ప్రణాళికలు రూపొందించుకుని విజయ మార్గంలో పయనించాలని కోరారు. 2025 సంవత్సరం తెలంగాణ ప్రజలందరికీ శుభాలు, సంతోషాలు నింపేది కావాలని ఆకాంక్షించారు.