హైదరాబాద్, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు తమకు వెంటనే రుణమాఫీ చేయాలని చేనేత కార్మికులు శుక్రవారం చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాంతికుమార్ ఆధ్వర్యంలో పలువురు నేతన్నలు మంత్రికి వినతిపత్రం అందచేశారు. పది రోజుల్లో రుణమాఫీ చేయకపోతే దీపావళి తర్వాత సర్కారుపై పోరాటాలకు దిగుతామని తెలిపారు.
వినియోగదారులకు నాణ్యమైన చేనేత ఉత్పత్తులు అందించేందుకు రాష్ట్ర చేనేత జౌళిశాఖ ‘చేనేత లేబుల్’ను రూపొందించిందని తుమ్మల తెలిపారు. శుక్రవారం సచివాలయంలో చేనేత జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. జర్మనీకి చెందిన ైక్లెమెట్-రీసైలెంట్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ-ఎక్రాట్(ఏసీఆర్ఏటీ)ప్రతినిధులు మంత్రి తుమ్మలతో సమావేశమయ్యారు.