హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పథకాన్ని ఆమోదించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం ద్వారా తెలంగాణ నేతన్న పొదుపు (పొదుపు నిధి), తెలంగాణ నేతన్న భద్రత (నేతన్న బీమా), తెలంగాణ నేతన్నకు భరోసా అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలో అనేక పథకాలను ప్రారంభించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నా రు. సచివాలయంలో కలెక్టర్లతో శుక్రవా రం సమావేశమయ్యారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ 26 నుంచి రైతు భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు రూల్స్ పాటించకుంటే బస్సులను సీజ్ చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. సంక్రాంతి సందర్భంగా సచివాలయంలో ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో శుక్రవారం సమీక్షించారు. పండుగకు టీజీఎస్ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు.