రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పథకాన్ని ఆమోదించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
పాఠశాలలు పునఃప్రారంభమవడంతో స్కూళ్లు, కాలేజీల బస్సులను ఆర్టీవో అధికారులు తనిఖీ చేశారు. బుధవారం రవాణా శాఖ అధికారులు బృందాలు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టి, నిబంధనలు పాటించని పాఠశాల బస్సులను సీజ్ చేశ