హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): పాఠశాలలు పునఃప్రారంభమవడంతో స్కూళ్లు, కాలేజీల బస్సులను ఆర్టీవో అధికారులు తనిఖీ చేశారు. బుధవారం రవాణా శాఖ అధికారులు బృందాలు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టి, నిబంధనలు పాటించని పాఠశాల బస్సులను సీజ్ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఫిట్‌నెస్‌లేని, పన్నులు చెల్లించని 46 బస్సులను సీజ్ చేసి, కేసులు నమోదు చేసినట్టు జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు. లంగర్‌హౌజ్‌లో నిబంధనలు పాటించని పాఠశాల బ స్సును సీజ్ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ గడు వు ముగియడంతో డ్రైవర్‌పై కేసు న మో దు చేశారు. పాఠశాల బస్సుల్లో ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, ఫైర్ సేఫ్టీకిట్, ఫస్ట్‌ఎయిడ్ కిట్లను అధికారులు తనిఖీ చేశారు.