హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ముందు ఇచ్చిన హామీ లు అమలు చేయకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ఎదురుగాలి తప్పదని సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మె ల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. చేనేతరంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాల ని కోరుతూ సోమవారం మన్సురాబాద్ సహా రా స్టేట్స్ గాంధీజీ విగ్రహం దగ్గర చేనేత కార్మి క సంఘం అధ్యక్షుడు వనం శాంతి కుమార్ అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. దసరాలోగా చేనేత కార్మికుల రుణమాఫీ చేసి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేశారు. చేనేత కార్మి క సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాంతికుమార్ మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు ప్రభుత్వం యూనిఫాం దుస్తుల ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. స్వయం సంఘాల సభ్యులకు చీరలు ఇస్తామన్న ప్రభుత్వం.. సద్దుల బతుకమ్మ వచ్చినా ఇవ్వలేదని మండిపడ్డారు.