నల్లగొండ : రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్(Saichand) మృతిపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప గాయకున్ని, భవిష్యత్ నాయకున్నీ కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. తన ఆట పాటలతో తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం( Reconstruction )లో సాయి చందు పాత్ర ఎంతో విశేషమైనదని కొనియాడారు. సాయిచంద్ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు.
ప్రముఖ గాయకుడు సాయిచంద్ అకాల మృతి పట్ల రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud)దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో, పునర్నిర్మాణంలో సాయి చంద్ ఎంతో కీలకమన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని వేడుకున్నారు.

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతున్ని ప్రార్థించారు.