హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు(Telangana temples) విజయ డెయిరీ(Vijaya Dairy) నెయ్యినే సరఫరా చేస్తామని తెలంగాణ డెయిరీ డెలవప్మెంట్ సొసైటీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి(Gutha Amit Reddy) తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాల సేకరణ రేటును మూడు సార్లు రూ.12.48 రూపాయలు పెంచారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాల సేకరణ రేటు పెంచడంతో పాల సేకరణ గణనీయంగా పెరిగిందన్నారు.
ఇక నుంచి విజయ డెయిరీ పాల అమ్మకాలు మరింత పెంచడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్షేమ హాస్టళ్లకు, పాఠశాలలకు, జైళ్లు, హాస్పిటల్స్‌కు అవసరమైన పాలు, పాల పదార్ధాలు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. అలాగే పెండింగ్ పాల బిల్లులను కూడా త్వరలోనే చెల్లిస్తామని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | అబద్ధం ఆడితే అతికేటట్టు ఉండాలి.. మంత్రి శ్రీధర్ బాబుకు హరీష్ రావు కౌంటర్
Harish Rao | 10 నెలల్లో 2 వేల అత్యాచారాలు.. ఇదీ రేవంత్ రెడ్డి పాలన