సూర్యాపేట : రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా మద్దిరాలలోని మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ బాలికల విద్యాలయంలో ఓ విద్యార్థిని (Gurukul school student)ఆత్మహత్యాయత్నానికి(student Attempts suicide) పాల్పడింది. 9 వతరగతి చదువుతున్న విద్యార్థిని వల్లపు హర్షిత హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
గమనించిన ఉపాధ్యాయులు హర్షితను సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు తరలించారు.
పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Kaleshwaram | చివరికి కాళేశ్వరమే దిక్కయింది.. గంగా ప్రవాహంలో కొట్టుకుపోయిన కాంగ్రెస్ అబద్ధాలు
KTR | కాకుల్లా ఏకం కావాలి.. రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించాలి.. కార్మికులకు కేటీఆర్ పిలుపు
KTR | లక్షా 40 వేల కోట్లు అప్పు చేసి ఏం పీకినవ్ రేవంత్..? సూటిగా ప్రశ్నించిన కేటీఆర్