సూర్యాపేట, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి సీఎం కావడం ప్రధాని మోదీ చాయిసేనని మాజీ మం త్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ మోదీకి బీ టీమ్‌గా పనిచేస్తున్నదని, మోదీ దగ్గర రేవంత్‌కు ఉన్న ప్రాధాన్యత కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు లేదని తెలిపారు. బుధవారం ఆయన సూర్యాపేటలో మీ డియాతో మాట్లాడారు. చరిత్రలో సీబీ ఐ, ఈడీ నమోదు చేసిన వాటిల్లో లిక్కర్ కేసు పరమ చెత్తదని వ్యాఖ్యానించారు. కోర్టులో సాక్ష్యాలపై న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సీబీఐ, ఈడీ తరపు న్యాయవాదులు తటపటాయించడం చూస్తుంటే రాజకీయపరంగా పెట్టించిన కేసు అనేది మరోసారి నిర్ధారణ అయిందని తెలిపారు.
ఈ కేసు నిరాధారమైనదని బీఆర్ఎస్ తరపున తాము మొదటి నుంచి చెబుతున్నామని పేర్కొన్నారు. ఎవరో చెప్పారని అరెస్టు చేసి జైలులో పెట్టినప్పటికీ కోర్టు లో కవితకు న్యాయం జరిగిందన్నారు. తాము ఊహించినట్టుగానే కవిత కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని, చిన్న ఆధారం లేకుండా, ఎవరూ ఫిర్యాదు చే యకపోయినా, కేవలం రాజకీయ ఒత్తిళ్ల తో సీబీఐ, ఈడీ చేసిన ప్రయత్నమని బహిరంగంగా అర్థం అవుతుందని విమర్శించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్, కేజ్రీవాల్‌ను ఇబ్బంది పెట్టడానికే ఈ కేసు పెట్టారని ఆరోపించారు. నోట్ల కట్టలతో, వీడియోలతో పట్టపగలు దొం గగా దొరికి అధికారం చలాయిస్తున్న వా రికి నిరాధార కేసులో కవిత బెయిల్‌పై వస్తే ఏడుపెందుకని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో రాహుల్, రేవంత్ తొలి నుంచి విరుద్ధంగా మాట్లాడుతున్నారని, ఢిల్లీలో లిక్కర్ కేసు ఫేక్ అని రాహుల్ అంటే.. అదే కేసుపై తెలంగాణలో రేవంత్ మా త్రం కుంభకోణం అంటాడని, ఇదేం కాంగ్రెస్సో, వారేం నాయకులో అర్థం కా వడం లేదని మండిపడ్డారు.
ఇక రాష్ట్రం లో కాంగ్రెస్ వైఫల్యాలపై మాట్లాడని బీజేపీ ఇంకా రాష్ట్రంలో బీఆర్ఎస్సే అధికారంలో ఉన్నట్టు భావిస్తున్నదని, అం దుకే తమ పార్టీపైనే దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. దీని ద్వారా వారి బలహీనతలు, వారి ఐక్యత అర్థం అవుతుందని అన్నారు. కర్ణాటకలోని వాల్మీకీ కుంభకోణంలో టీ కాంగ్రెస్ నేతల ప్ర మేయం ఉన్నా బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.