ఆదిలాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో పండే పత్తికి కేంద్ర ప్రభుత్వం గుజరాత్ ధర చెల్లించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడి పత్తి చాలా నాణ్యమైనదని పలు పరిశోధన అధ్యయనాల్లో వెల్లడైందని వివరించారు. ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యేలుగా బీజేపీకి చెందిన వారు ఉన్నారని, ఇద్దరూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రైతులకు గుజరాత్ ధర వచ్చేలా చూడాలని సూచించారు.