గుమ్మడిదల,ఫిబ్రవరి 5: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొన్నిరోజులుగా ఎమ్మెల్యే గూడెం కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే తనయుడు విక్రమ్‌రెడ్డి గురువారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని 22 వార్డుల అభ్యర్థులను కలిసి తమమద్దతు ప్రకటించారు. ప్రచారాన్ని విస్తృ తం చేయాలని, బాకీ కార్డుతో ఓటర్లను ప్రభావితం చేయాలని అభ్యర్థులకు సూచించారు.
గుమ్మడిదల, బొంతపల్లి, వీరన్నగూడెం, దోమడుగు, అన్నారం పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆయన కలిశారు. బొంతపల్లిలో 16,17 వార్డుల అభ్యర్థులు ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, కుమార్‌గౌడ్, 11వ వార్డు అభ్యర్థి చిన్నపాపని కుమార్‌గౌడ్, అన్నారంలో అభ్యర్థులు నరహరి, మేడిపల్లి మురళి, తూపాకుల రాధికారాజు తదితరులను కలిసి మద్దతు తెలిపి ప్రచారం చేశారు. బొంతపల్లిలో వీరన్నగూడెంకు చెందిన కానుకుంట సుధాకర్‌తోపాటు 20 మంది 10వ వార్డు అభ్యర్థి షేక్గౌసియాహుస్సేన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ని వీడి విక్రమ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.