హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): గ్రూప్ 1 నియామకాలు తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టంచేసింది. గ్రూప్-1 పరీక్షల నిలిపివేతకు నిరాకరించింది. ఈ నెల 21 నుంచి పరీక్షలు జరగున్నాయని, ఈ పరిస్థితుల్లో ఏవిధమైన మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయబోమని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, టీజీపీఎస్సీలకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. ది వ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022 నాటి జీవో 55కు సవరణ తీసుకువస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 8న జీవో 29 జారీచేయడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ద్విసభ్య ధ ర్మాసనం బుధవారం విచారణ జరిపింది.పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపి స్తూ జనరల్ క్యాటగిరీలోని అభ్యర్థులకంటే ఎకువ మారులు సాధించినవారిని అన్ రిజర్వుడుగా పరిగణించడం వల్ల దివ్యాంగులకు అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. వారికంటే ఎకువ మారులు వచ్చినప్పటికీ రిజర్వేషన్ క్యాటగిరీ కిందనే పరిగణించి 1:50 కింద అభ్యర్థులను మెయిన్‌కు పిలవాలని కోరారు. జీవో 55ను సవాల్ చేసిన వ్యాజ్యాలు విచారణలోనే ఉన్నాయని, దానికి సవరణ జీవో తేవడం చెల్లదని తెలిపారు. దీనికితోడు రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా 62 శాతానికి చేరడం చట్ట వ్యతిరేకమని అన్నారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, అవి కార్యనిర్వాహక ఉత్తర్వులు మాత్రమేనని చెప్పారు. దివ్యాంగుల చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం నిబంధనలు తీసుకువచ్చామని, జీవో రాజ్యాంగ విరుద్ధం కాదన్నారు. వాదనల తర్వాత హైకోర్టు స్టే ఇచ్చేందుకు, పరీక్షలను వాయిదా వేసేందుకు నిరాకరించింది.