Yadadri | రాజాపేట, జనవరి 19 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కుంటలు వట్టిపోవడంతో భూగర్భ జలాలు మరింతగా పడిపోయాయి. మండలంలోని కొన్రెడ్డిచెర్వు గ్రామానికి చెందిన రైతు చెరుకు కనకయ్యకు పాముకుంట శివారులో రెండు ఎకరాల పొలం ఉన్నది.
ఈ సారి నీళ్లు లేక చెరువులు వట్టిపోవడంతో పొలంలో ఉన్న బోరు ఎండిపోయింది. దాంతో వరి సాగు చేయాలని ఆదివారం పాముకుంట గ్రామ శివారు పుట్టెగూడెం సమీపంలో మరో బోరు వేయించాడు. 750 ఫీట్లు వేసినా చుక్క నీరు రాలేదు. దుమ్మే రావడంతో రైతన్నకు నిరాశే మిగిలింది.