గ్రీన్ ఇండియా చాలెంజ్ మహోన్నతమైంది : శ్రీ శ్రీ రవి శంకర్
Green India Challenge | ప్రముఖ యోగ గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపకుడు శ్రీ.శ్రీ. రవి శంకర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా శంకర్‌పల్లిలోని మానస గంగా ఆశ్రమంలో ఉసిరి మొక్కనను నాటారు.

రంగారెడ్డి : మొక్కల యజ్ఞం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి సాధువులు, గురువుల వరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ముందుకు తీసుకుపోతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ప్రముఖ యోగ గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపకుడు శ్రీ.శ్రీ. రవి శంకర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా శంకర్‌పల్లిలోని మానస గంగా ఆశ్రమంలో ఉసిరి మొక్కనను నాటారు.
ఈ సందర్భంగా చెట్ల ఔన్నత్యాన్ని చాటేలా..భారతీయ సంస్కృతిలో చెట్ల ప్రాముఖ్యతను తెలిపేలా ముద్రించిన ‘వృక్షవేదం’ పుస్తకం గురించి గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి రాఘవ రవిశంకర్‌కి వివరించారు. అనంతరం రవిశంకర్ మాట్లాడుతూ..రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం మహోన్నతమైందన్నారు.

భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రకృతిని కాపాడాలనే వారి ఆలోచన అద్భుతమైందని ప్రశంసించారు. చెట్లు రెండు రకాలు ఉంటాయి. ఒకటి పండ్లను ఇస్తూ.. జీవుల ఆకలి తీర్చేవి. రెండు ఏపుగా పెరిగి జీవులకు నీడనిచ్చేవి. ఇవి రెండు మానవళికి ఉపయోగకరమైనవేనని ఆయన తెలిపారు.
అయితే జీవుల అవసరాలను గుర్తిస్తూ.. అందుకు అనుగుణంగా మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అది గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు చేస్తున్న తీరు నన్నెంతో ఆకట్టుకుందన్నారు. కార్యక్రమంలో బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, మల్లికార్జున్ రెడ్డి, ఆశ్రమ బాధ్యులు, ఇతర భక్తులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన లారీ..
జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల విధ్వంసం
Hyderabad | భర్తకు మద్యం తాగించి భార్యపై హత్యాచారం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

