హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ప్రభాకర్‌రావు తనకు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అమెరికా లో ఉన్న ప్రభాకర్‌రావు భారత్ వచ్చిన వెంటనే దర్యాప్తు అధికారులకు సహకరిస్తానని తెలిపారు. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జే శ్రీనివాసరావు విచారణ చేపట్టారు.