Telangana | హైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. ఈ జాబితాపై సెప్టెంబర్ 7 నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది జాబితా ప్రచురించనున్నారు. ఈ మేరకు ఓటరు జాబితా తయారీపై ఈ నెల 29న కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.
ఇవి కూడా చదవండి..
KTR | సీఎం రేవంత్ రెడ్డి చిల్లర భాషపై కేటీఆర్ ఫైర్..
KTR | నాకంటూ ఎలాంటి ఫామ్ హౌజ్ లేదు.. తప్పుంటే దగ్గరుండి నేనే కూలగొట్టిస్తా : కేటీఆర్