కేసముద్రం, జూన్ 28 : రైస్ మిల్లుల్లో రూ.30 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. సివిల్ సప్లయీస్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు శుక్రవా రం తనిఖీలు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వ చ్చింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని 3 రైస్ మిల్లుల్లోనే ఈ ధాన్యం మాయం కావ డం సంచలనం సృష్టించింది.
మణికంఠ రైస్ మిల్లులో 12, 360 క్వింటాళ్లు, మారుతి రైస్ మిల్లులో 43,464 క్వింటాళ్లు, మహదేవ రైస్ మిల్లులో 58,070 క్వింటాళ్ల ధాన్యం మాయం కాగా దీని విలువ సుమారు 30 కోట్లు ఉంటుందని, యజమానులపై కేసు నమోదు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.