మక్తల్/చౌటుప్పల్/ భూదాన్‌పోచంపల్లి, ఏప్రిల్ 27 : నారాయణపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసింది. నారాయణపేట జిల్లా మక్తల్‌లో మండలం ఉప్పర్‌పల్లిలో పిడుగుపడటంతో భవన నిర్మాణ కార్మికుడు అంజప్ప(30) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే మండలంలో దాదన్పల్లిలో పిడుగుపాటుకు కురుమూర్తి (16) మరణించాడు. మక్తల్ పట్టణంతోపాటు కృష్ణ మం డలం కాందోటి గ్రామంలో పిడుగుపాటుకు రెండు పశువులు మృత్యువాతపడ్డాయి. మాగనూరు, కృష్ణ మండలాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్తోపాటు భూదాన్ పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెంలో ధాన్యం తడవడంతో అన్నదాతలు అవస్థలు పడ్డారు. ఒక్కసారిగా వర్షం రావడంతో ధాన్యం తడిసిందని, ధాన్యం తెచ్చి పదిరోజులైనా కొనుగోలు చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు ధాన్యా న్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతు న్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.