హైదరాబాద్, నవంబర్ 26(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లను త్వర గా పూర్తి చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీ సుకోవాలని కలెక్టర్లను, అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్య లు తీసుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన ధాన్యం కొనుగోళ్లపై మంత్రులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సన్న, దొడ్డు రకాలను వేర్వేరుగా సేకరించాలని, ధాన్యం విక్రయించిన రైతుకు చెల్లింపులు వెంటనే పూర్తిచేయాలని, సన్న రకాలకు బోనస్ ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉన్నదని చెప్పారు. 30న జరిగే రైతు పండుగను కలెక్టర్లు సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.