మక కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం.. ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు ఫైర్
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల నడ్డివిరుస్తున్నదని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
- మేడిగడ్డ మరమ్మతులు విషయంలో మీనమేషాలు
- హామీల అమలులో సర్కార్ విఫలం: దాస్యం
హనుమకొండ, ఏప్రిల్ 9 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల నడ్డివిరుస్తున్నదని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల్లో మకజొన్న రైతులను ఆదుకోవాలని, మద్దతు ధర కల్పించాలని బీఆర్ఎస్ ఒత్తిడి చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. గురువారం హనుమకొండ బాల సముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగు చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో సాగు అయినట్టు చెప్పారు. పోర్టల్‌లో నమోదు చేస్తేనే మక్క జొన్న పంటను కొనుగోలు చేస్తామనడంపై ఆందోళన వ్యక్తంచేశారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయకపోవడం వల్ల ఎల్ఎండీ ఎండిపోయే పరిస్థితి నెలకొన్నదని, మూడు జిల్లాల్లో తాగు, సాగు నీటి కొరత ఏర్పడుతున్నదని చెప్పారు.
నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉన్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. 420 హామీలు, 6 గ్యారెంటీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి వాటి అమలును పూర్తిగా మరచిపోయిందని విమర్శించారు. ఉద్యోగులు, కార్మికులు, ఆశా వరర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రెండున్నరేండ్లు దాటినా అమలు చేయలేదని మండిపడ్డారు. విద్యుత్తు రంగాన్ని కేసీఆర్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన విషయాన్ని గుర్తుచేశారు.
కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు విద్యుత్తు శాఖలోని 26 వేల మంది ఆర్టిజన్లను పర్మినెంట్ చేసి జీతాలు పెంచినట్టు చెప్పారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు కల్పించాలని, భూ నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, కాజీపేటను డివిజన్‌గా ప్రకటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కుడా మాజీ చైర్మన్ యాదవరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

