హైదరాబాద్ : రాష్ట్రంలో మొదటి డోసు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి కావడంపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హర్షం వ్యక్తం చేశారు. టీకా వేసిన వైద్యారోగ్య శాఖ సిబ్బంది, వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలకు గవర్నర్ అభినందనలు తెలిపారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును కూడా ట్విట్టర్ వేదికగా తమిళిసై ప్రశంసించారు. రాష్ట్రంతో పాటు మరో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా మొదటి డోసు వంద శాతం పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కృతజ్ఞతలు తెలిపారు.
Congratulations Telangana citizens, Health team
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 29, 2021
@trsharish for achieving 100%vaccination of 1st dose alongside seven other states&UT Thank you honb @PMOIndia @narendramodi ji @MoHFW_INDIA @mansukhmandviya for providing adequate vaccines 2 #LargestVaccineDrive to 143 crores sofar pic.twitter.com/luKMI5EXF5