హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : నాలుగు రోజుల పర్యటన కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్ నుంచి బయల్దేరిన ఆయన మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకున్నారు. 13, 14, 15 తేదీల్లో ఢిల్లీ, హర్యానాల్లో నిర్వహించే పలు కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రదేశాల్లో గవర్నర్‌కు జెడ్‌ప్లస్ క్యాటగిరీ భద్రత కల్పించాలని ఢిల్లీ సీపీ, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌ను రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు కోరారు.