ములుగు : ఆధునిక సమాజంలో ఆదివాసీలు(Adivasis), గిరిజనులను భాగస్వాములు చేసేందుకు ప్రభు త్వాలు కృషి చేస్తున్నాయి. ఆదివాసీ, గిరిజన గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) అన్నారు. మంగళవారం గవర్నర్ ములుగు(Mulugu) జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. తాను గవర్నర్గా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యట నగా షెడ్యూల్ ప్రాంతమైన ములుగు జిల్లాను ఎంచుకున్నాను. తాను కుడా గతంలో పంచాయతీ రాజ్, రూర ల్ డెవలప్మెంట్ మంత్రిగా పని చేసిన అనుభవం ఉందన్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో గిరిజనులు ఆదివాసీలు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వీరికి అన్ని రకాలుగా మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేయ డం అభినందనీయమని పేర్కొన్నారు. మీరంతా అత్యుత్తమంగా విద్యను అభ్యసించి నవ సమాజ నిర్మాణం లో కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. గిరిజను,ఆదివాసీలు ఆధునిక సమాజానికి అనుగుణంగా ప్రభు త్వం కల్పిస్తున్న అవకాశాలతో అన్ని రంగాల్లో ఆర్థికంగా పైకి రావాలని సూచించారు. ఇతర వర్గాలకు ఆదర్శంగా నిలువాలని, ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.