మెదక్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : శాంతికి ప్రతీక మెదక్ చర్చి అని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. మెదక్ చర్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు, గవర్నర్ కార్యదర్శి దాన కిషోర్, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్ నగేశ్, ప్రెస్ బ్రీటర్ ఇన్చార్జి శాంతయ్య పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 22: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం వాడి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 50 మంది బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం ఎల్లారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో వీరు బీఆర్ఎస్లో చేరగా.. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాజాల మాట్లాడుతూ..రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు.