భారత 76వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పల్లె నుంచి ఢిల్లీ దాక ప్రజలు సంబురాల్లో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయగా.. కర్తవ్యపథ్‌లో నిర్వహించిన వేడుకలు సైనికశక్తిని చాటాయి. హైదరాబాద్ పరేడ్‌మైదానంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పతాకావిష్కరణ చేశారు.
హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగం యుగయుగాలకు స్ఫూర్తి అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ సందేశం ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎకడైతే మనసు భయం లేకుండా ఉంటుందో, తల ఎత్తుకుని ఉండగలమో, ఎకడైతే స్వేచ్ఛ గా జ్ఞానాన్ని సముపార్జించగలమో, నాలుగు గోడల మధ్య ప్రపంచం ముకలుగా విడిపో దో..’ అన్న రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యాఖ్యలు సమైక్య, సమ్మిళిత, ప్రగతిశీల తెలంగాణ రాష్ట్ర దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేదర్ వంటి దార్శనికుడు, ఇతర రూపకర్తల ఆధ్వర్యంలో రూపొందిన భారత రాజ్యాంగం చట్టపరమైన పత్రం మాత్రమే కాదని, మన ప్రజాస్వామ్యాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి అని కొనియాడారు. అంబేదర్ చెప్పినట్టు.. రాజ్యాంగం కేవలం న్యాయపత్రమే కాదని, అది జీవన వాహకమని, యుగయుగాలకు స్ఫూర్తి వంటిదని పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా నిలుస్తున్నదని, 2024 వానాకాలంలో రికార్డు స్థాయిలో 1.59 కోట్ల టన్నుల వరి ధాన్యం పండిందని స్పష్టం చేశారు.
దేశంలోనే తెలంగాణ అత్యధిక వరి ఉత్పత్తి సాధించిందని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 133.91 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణాలు చేసి రూ.4,501.10 కోట్లను ఆదా చేశారని వెల్లడించారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసా ద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్, జీఏడీ కార్యదర్శి రఘునందన్‌రావు, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్టుదేశ్ వర్మ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్ హాజరయ్యారు.