హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని బాధ్యతలు స్వీకరించారు. మాసాబ్ ట్యాంక్‌లోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో గురువారం బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఈసీ కార్యదర్శి అశోక్ కుమార్, ఇతర అధికారులు ఆమెను అభినందించి స్థానిక సంస్థల ఓటరు జాబితా షెడ్యూల్ వివరించారు. అనంతరం ఆమె రాజ్‌భవన్‌లో గవర్నర్ జీష్ణు దేవ్ వర్మను మర్యాద పూర్వకంగా కలిశారు. మూడేండ్ల పాటు ఆమె బాధ్యతల్లో కొనసాగనున్నారు.