ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,897 పోస్టులకు ప్రభుత్వం అనుమతి
Minister Harish rao | ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,897 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వివిధ కేటగిరీల్లో తొమ్మిది వైద్య కళాశాలలు, అనుబంధ హాస్పిటళ్లకు పోస్టులను మంజూరు చేసింది.
హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,897 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వివిధ కేటగిరీల్లో తొమ్మిది వైద్య కళాశాలలు, అనుబంధ హాస్పిటళ్లకు పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీచేసింది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్‌లోని మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్పిటళ్లకు ఈ పోస్టులను మంజూరు చేసింది. వీటిలో ఒక్కో కాలేజీకి 433 పోస్టులను కేటాయించింది.
వైద్య కళాశాలలకు కొత్తగా పోస్టులు మంజూరు చేయడంపట్ల మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు పడిందని అన్నారు. అందరికీ సరైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
433 posts have been created per college in 9 new Medical Colleges and attached Government General Hospitals at Rajanna Sircilla, Kamareddy, Vikarabad, Khammam, Karimnagar, Jayashankar Bhupalapally, Komarambeem Asifabad, Janagoan and Nirmal 2/2
— Harish Rao Thanneeru (@BRSHarish) December 1, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

