శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 02:43:27

‘సత్యమేవ జయతే’ తప్పనిసరి

‘సత్యమేవ జయతే’ తప్పనిసరి

  • రాజముద్రపై దేవనాగరి లిపి వాడాలి
  • మార్గదర్శకాలు జారీ 

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు భారతదేశ రాజముద్రలో తప్పనిసరిగా ‘సత్యమేవ జయతే’ని వాడాలని, అదికూడా దేవనాగరి లిపిలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌ రాజమద్రను వినియోగించడానికి అనుమతి ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థ లు, ఏజెన్సీలను ఆదేశించారు. రాజముద్రను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అధికారం ప్రభుత్వ సంస్థలకు ఉన్నదని, దేవనాగరి లిపిలో ‘సత్యమేవ జయతే’ అనే నినాదంతో కూడిన రాష్ట్ర చిహ్నాన్ని చిత్రీకరించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా.. ‘సత్యమేవ జయతే’ లేకుండా రాజముద్రను వినియోగించిన వారిపై స్టేట్‌ ఎంబ్లమ్‌ ఆఫ్‌ ఇండియా-2005, 2007 చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి నిబంధనలను భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌ http://www.mha.gov.inలో అందుబాటులో ఉన్నాయని స్పష్టంచేశారు.


logo