ఆదిబట్ల, ఏప్రిల్ 29: కాంగ్రెస్ ప్రభుత్వం గత ఆగస్టులో ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి మంగల్పల్లిలో అద్దె భవనంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. 50 మంది విద్యార్థులు చదువుతున్నారు. రూ.కోటీ 44 లక్షల అద్దె పెండింగ్లో ఉండటంతో మెడికల్ కళాశాలకు మంగళవారం ఉదయం యాజమాన్యం తాళం వేశారు. దీంతో విద్యార్థులతో పాటు అధ్యాపకులు కళాశాల బయట మండుటెండలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో జోక్యం చేసుకుని తాళం తీయించడంతో తరగతులు ప్రారభమైయ్యాయి.