హైదరాబాద్, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు కలిపి రూ. 2,780కోట్లు విడుదలచేసింది. ఈ ని ధులతో 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 2,432 అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఆమోదం తెలిపిం ది. వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రా రంభించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, విలీనమైన గ్రామాలతో విస్తరించిన పట్టణప్రాంతా ల్లో ప్రాధాన్యతాక్రమంలో పనులు చేపట్టాలని సూచించారు. పట్టణాభివృద్ధి ప్రణాళికలో భాగంగా విడుదలైన ఈ నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, పారులు, శానిటేషన్ వంటి మౌలిక వసతులు కల్పించనున్నారు.