హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అత్యంత కీలకమైన విద్యాశాఖ రథ సారథులంతా మహిళలే. ఇప్పటికే ఇద్దరు మహిళా ఐఏఎస్‌లు సారథ్యం వహిస్తుండగా, ఇదే కోవలో ఇంటర్ బోర్డు నూతన కార్యదర్శిగా అభిలాష అభినవ్‌ను స ర్కార్ నియమించింది. ఇప్పటిదాకా విద్యాశాఖ కార్యదర్శిగా యోగితారా ణా, సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌గా శ్రీదేవసేన కొనసాగుతున్నారు. తాజాగా ఇంటర్‌బోర్డు కార్యదర్శిగా మహిళా అధికారినే సర్కార్ ని యమించింది. దీంతో మూడు కీలక పదవుల్లో మహిళా అధికారులే ఉన్నా రు. కిందిస్థాయి హోదాల్లోనూ వారి నాయకత్వమే ఉన్నది. ఇంటర్ బోర్డు కీలక పదవుల్లోనూ వారే ఉన్నారు.
ఇంటర్ పరీక్షల విభాగం కంట్రోలర్ గా జయప్రదాబాయి సేవలందిస్తున్నారు. అకాడమిక్ విభాగం జా యింట్ సెక్రటరీగా వసుంధర, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ విభాగం ఇన్చార్జిగా జ్యోత్స్న కొ న సాగుతున్నారు. పాఠశాల విద్యాశాఖలోనూ మహిళా అధికారులదే హవా గా కొనసాగుతున్నది. ఈ శాఖలోని కీలక పోస్టుల్లో మహిళ అధికారులే ఉన్నారు. సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా రాధారెడ్డి, మధ్యాహ్న భోజన పథకం అదనపు డైరెక్టర్‌గా జీ ఉషారాణి, జవహర్ బాల భవన్, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ డైరెక్టర్‌గా విజయలక్ష్మీబాయి, సమగ్రశిక్ష ఆర్జేడీగా వెంకటనర్సమ్మ కొనసాగుతున్నారు.