Ration Cards | హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): కులగణన నివేదిక ఆధారంగానే ఆహారభద్రతా కార్డులను ప్రభుత్వం మంజూరు చేయనున్నది. కులగణన సర్వే జాబితాలోని నమోదు చేసుకున్న వారి వివరాలను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, గ్రామసభలో ఆమోదం తీసుకున్న తర్వాతనే లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. అర్హత గల కుటుంబాలకు ఈ నెల 26వ నుంచి కార్డులను మంజూరు చేయనున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆహారభద్రత కార్డుల మంజూరుకు పాటించాల్సిన విధివిధానాలను ఖరారు చేస్తూ మార్గదర్శకాలు వెల్లడించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు, పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించింది.
కార్డుల జారీకి విధివిధానాలు
అర్హతలు