Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ‘ఆధునిక సౌకర్యాల మాట దేవుడెరుగు.. కొన్ని రోజులుగా 2వ, 3వ క్వార్టర్ మందులే ఇంకా విడుదల కాలే దు.. కానీ పత్రికల్లో వచ్చే వార్తలకు వైద్యులు, వైద్యాధికారులు వివరణ ఇవ్వాలా.. ఇదెక్కడి న్యాయం’ అంటూ తెలంగాణ ప్రభుత్వ వైద్యు లు కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడుతున్నారు. సామర్థ్యానికి మించి పనిచేస్తున్నా.. బయోమెట్రిక్‌లు, రోజువారి రిజిస్టర్లు అంటూ తమను మానసికంగా ఇబ్బందులు పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారితోషికానికి సంబంధించిన పెరిఫెరల్ ఫైల్‌ను సీఎం ఏడు నెలలుగా తన వద్దనే పెండింగ్‌లో ఉంచుకొని, అది అమలు చేయకుండానే వైద్యులను హడావుడిగా జిల్లాలకు బదిలీ చేయడంపై మండిపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా, బలవంతం గా అక్కడికి పంపి మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత సా ధారణ సెలవులు ఇవ్వకపోగా ఈఎల్స్ కూడా ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తూ తమను వేధిస్తున్నారని వాపోతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే త్వరలోనే సమ్మె నోటీసు ఇస్తామంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పనిగంటలు పెరిగినా.. మెరుగవ్వని పారితోషికం
ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో దవాఖాన ల్లో సిబ్బంది కొరతతోపాటు కనీస వసతులు లేవని, మందులు అందుబాటులో ఉండడం లేదని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలోని చాలా వైద్య కళాశాలల్లో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు తక్కువగా ఉన్నాయ ని, దీంతో నలుగురు చేయాల్సిన పని ఒకరిద్దరే చేయాల్సిన పరిస్థితి ఉన్నట్టు వాపోతున్నారు. దీంతో వైద్యులకు పనిగంటలు పెరుగుతున్నాయని, ఎక్కువ డ్యూటీలు చేయాల్సి వస్తున్నద ని, అయినా పారితోషికం మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణం గా వైద్యులకు పదోన్నతులు వచ్చినప్పుడు ఏదైనా కారణంతో వద్దనుకుంటే మొదటి సారి వదిలేస్తారు.. రెండోసారి మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా వారు కోరుకున్న ఆప్షన్స్‌లో ఏదో ఒక చోట పోస్టింగ్ ఇస్తారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ హ యాంలో తొలిసారిగా వచ్చిన పదోన్నతిని తిరస్కరించినా బలవంతంగా ఇస్తున్నారని, కనీ సం ఆప్షన్ కూడా అడగకుండా ఎక్కడపడితే అక్కడ పోస్టింగ్ ఇస్తున్నట్టు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏడు నెలలుగా సీఎం వద్దనే ఫైల్
అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్న నగరంలో పనిచేసే వైద్యులకు 40శాతం అధిక పారితోషికాలు ఉండడం, సరైన సదుపాయా లు లేని మారుమూల గ్రామాల్లో పనిచేసే వారి కి తక్కువ జీతాలు ఉండడంతో చాలా మంది వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు ట్రైబల్ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు 50శాతం, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వారికి హైదరాబాద్‌లో పనిచేసే వారితో సమానంగా వేతనాలు చెల్లించేలా ప్రతిపాదనలు రూపొందించింది. దీనికి సంబంధించిన 5096-ఏ-2024 నంబర్ గల పెరిఫెరల్ ఫైల్ మే నెలలో సీఎం కార్యాలయానికి ఉన్నతాధికారులు పంపించారు. అప్పటి నుంచి ఏడు నెలలుగా ఆ ఫైల్ ముఖ్యమంత్రి వద్దనే పెండింగ్‌లో ఉంది. కానీ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఉస్మానియా, గాంధీ తదితర దవాఖానల నుంచి కరీంనగర్, జగిత్యాల, ఆసిఫాబాద్ వంటి జిల్లాలకు తమను బదిలీ చేశారని పలువురు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా హడావుడిగా బదిలీలు చేయడంపై బాధిత వైద్యాధికారులు మండిపడుతున్నారు.
హెల్త్ సెక్రటరీ అంటేనే హడల్
వైద్య, ఆరోగ్యశాఖలో హెల్త్ సెక్రటరీ అంటేనే హడల్. కనీసం తమ సమస్యలు వినేందుకు కూడా హెల్త్ సెక్రటరీ ఇష్టపడరని, ఏదైనా సమస్యను విన్నవించేందుకు వెళ్తే గంటల తరబడి నిరీక్షించాల్సి ఉంటుందని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఇక డీఎంఈ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని డాక్టర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా ఇలానే మానసిక ఒత్తిడికి గురిచేస్తే త్వరలోనే సమ్మె నోటీసు ఇస్తామంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. పెరిఫెరల్ ఫైల్‌ను వెంటనే పరిష్కరించి ట్రైబల్, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికాన్ని పెంచేలా సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.