Congress Govt | హైదరాబాద్ , మార్చి 3(నమస్తే తెలంగాణ): అసంబద్ధ నిర్ణయాలతో, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు భూముల అమ్మకానికి తెరలేపింది. ఖజానాలో కాసులు లేక కటకటలాడుతున్న ప్రభుత్వం, ఎలాగైనా సొమ్ములు సమకూర్చుకునేందుకు విలువైన భూములను అడ్డికి పావుశేరుకు అమ్ముకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామం పరిధిలో టీజీఐఐసీకి చెందిన 400 ఎకరాల భూములను విక్రయించేందుకు యత్నిస్తున్నది. అంతర్జాతీయ స్థాయి లేఔట్‌ను ఏర్పాటు చేసి వేలం పాట నిర్వహించేందుకు కన్సల్టెంట్ నియామకానికి (ఆర్ఎఫ్పీ) టెండర్లు పిలిచింది. లేఔట్ మాస్టర్ ప్లాన్ తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వేలం ద్వారా ప్లాట్ల విక్రయాలు తదితర కార్యక్రమాల నిర్వహణ కోసం లావాదేవీ సలహా కన్సల్టెంటు నియామకానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)ని ఆహ్వానించారు. ఈ నెల 15 వరకు బిడ్ల దాఖలుకు గడువిచ్చారు. క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (క్యూసీబీఎస్) పద్ధతిలో బిడ్డర్‌ను ఎంపిక చేయనున్నట్టు పే రొన్నారు. అయితే, ఇవే భూములను బ్యాంకర్లకు కుదువ పెట్టి రూ.10 వేల కోట్ల రుణాలు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం గతంలో యత్నించింది. ఒక కన్సల్టెంట్‌ను నియమించింది. 400 ఎకరాలను ప్రైవేటు బ్యాంకులకు కుదువపెట్టి నిధులు సమీకరించుకుంది. ఆ సమయంలో జరిగిన ఒప్పందంలో ఒక క్లాజ్ పెట్టారు. తిరిగి కట్టలేని పరిస్థితుల్లో ఇవే భూ ములను విక్రయించి అప్పు చెల్లిస్తామని ప్ర భుత్వం పేర్కొన్నది. అనుకున్నట్టే ఇప్పుడు ఇవే భూములను అమ్మడానికి సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితికి ఇదే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
20 వేల కోట్ల ఆదాయమే లక్ష్యం..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వృద్ధి మందగించిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఓవైపు ఆదాయం తగ్గడం.. మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం దిక్కుతోచ ని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో నిధు ల సమీకరణకు రేవంత్ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తున్నది. వందల ఎకరాలను ప్రైవేట్ బ్యాంకర్లకు తనఖా పెట్టింది. అయినా కాసులకు కటకట ఏర్పడటంతో ఇప్పుడు ఏకంగా ఆ భూములను విక్రయించేందుకు సిద్ధమైంది. కంచ గచ్చిబౌలి గ్రామం సర్వే నంబరు-25 (పీ) పరిధిలోని 400 ఎకరాలను బ్యాంకర్లకు తనఖా పెట్టిన సమయంలో ప్రభుత్వం 25 కోట్లకు ఎకరం చొప్పున రూ.10 వేల కోట్లు సమీకరించింది. ఈసారి వేలం ద్వారా రెట్టింపు అంటే దాదాపు రూ.20 వేల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి. అత్యంత ఖరీదైన వెస్ట్ జోన్ పరిధిలో, ఐటీ కంపెనీలకు అతి సమీపంలోని ఈ భూమి విలువ లేఔట్లలో అయితే గజానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు పలికే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్నదని సమాచారం. ఈ నిధులను రైతుభరోసాతోపాటు ఇతర ప్రధాన హామీల అమలకు వినియోగించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
అంత మొత్తం కష్టమే..
హైడ్రా, మూసీ పునరుజ్జీవం వంటి విధ్వంసక నిర్ణయాలు, ప్రాజెక్టులను ఎండబెట్టి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేయడం వంటి కారణాలతో ప్రస్తుతం రాష్ట్రంలో రియ ల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తున్నది. భూ లావాదేవీలు ఎకడికకడ నిలిచిపోయాయి. దీంతో కొందరు బిల్డర్లు బలవన్మరణాలకు పాల్పడ్డ పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం వేలం నిర్వహించినా ఆ శించన ధర వచ్చే అవకాశం లేదని అధికార వ ర్గాలు చెబుతున్నాయి. ఐటీ జోన్లో భూము ల విలువ గజానికి రూ.2 లక్షలకుపైగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ స్థాయిలో ధర చెల్లించి కొనుగోలు చేసేవారు తకువేనని పేరొంటున్నారు. అందుకే లేఔట్లో పెద్ద ప్లాట్లను ఏర్పాటు చేసి కంపెనీలు, రియల్ ఎస్టే ట్ సంస్థలకు విక్రయించాలని నిర్ణయించిన ట్టు చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభు త్వం భూములు అమ్మినప్పుడు కాంగ్రెస్ నేత లు నానా రభస చేశారని, ఇప్పుడు వారు అదే బాటలో పయనిస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు… తమకు తనఖా పెట్టిన భూముల ను అమ్ముకునేందుకు బ్యాంకర్లు ఎలా అనుమతించాయన్నది ప్రశ్నగా మారింది.
అయితే ఒప్పందంలోనే ఈ వెసులుబాటు ఉన్నదని అధికార వర్గాలు చెబుతున్నాయి. భూముల అమ్మగా వచ్చిన డబ్బును బ్యాంకర్లకు చెల్లించేందుకు అవకాశం ఉన్నదని పేరొంటున్నా యి. మరోవైపు 400 ఎకరాల్లో కొంత భాగా న్ని బ్యాంకులకు పూర్తిగా అప్పగించి, మిగతా భాగాన్ని వేలం వేసేందుకు అనుమతి కోరిన ట్టు తెలుస్తున్నది. ఐటీ రంగ అభివృద్ధి కోసం కేటాయించిన భూములను ఇలా అడ్డగోలుగా అమ్మడంపై నిపుణులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పారిశ్రామిక, స్నేహపూర్వక విధానాలతో అభివృద్ధి చేసిన ఎకోసిస్టంతో ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయని గుర్తుచేస్తున్నారు. మరెన్నో కంపెనీలు రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయని అంటున్నారు. వాటికి ఈ 400 ఎకరాల భూమిని కేటాయించే వీలున్నా.. ప్రభుత్వం నిధుల కోసం టీజీఐఐసీ భూములను విక్రయిస్తున్నదని పలువురు విమర్శిస్తున్నారు.